![]() |
![]() |

సినిమాని మించిన ట్విస్ట్ లతో ప్రతీరోజు తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది ' ఎటో వెళ్ళిపోయింది మనసు ' సీరియల్. ఓ సీరియల్ లో రామలక్ష్మి పాత్రలో రక్ష నింబార్గి, సీతాకాంత్ పాత్రలో శ్రీకాంత్, సీతాకాంత్ చెల్లిలి పాత్రలో ప్రియా ప్రసాద్, రామలక్ష్మి చెల్లెలి పాత్రలో యోధ కంద్రాతి నటిస్తున్నారు.
ఈ సీరియల్ కి సంబంధించిన ప్రోమో ప్రతీ రోజు రిలీజ్ అవుతుండగా మిగిలిన సీరియల్స్ కంటే ఎక్కువగా వ్యూస్ ఈ సీరియల్ కి రావడంతో ఇది ప్రస్తుతం ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. కార్తీకదీపం2, బ్రహ్మముడి సీరియల్స్ తర్వాత ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ప్రోమో ఉండటం బట్టి చూస్తే కొత్తగా మొదలైన ఎక్కువ ఫ్యాన్ బేస్ పొందడంలో సక్సెస్ అయింది. దీనికి కారణం లేకపోలేదు. కన్నింగ్ మెంటాలిటి గల మాణిక్యం, సాఫ్ట్ నేచర్ గల రామలక్ష్మి తండ్రీ, కూతుళ్ళవడం.. వారికి తోడు సీతాకాంత్ అర్థం చేసుకునే మనస్తత్వం గలవాడు కావడం, పైగా తన చెల్లి సిరికి, రామలక్ష్మి ధనకి పెళ్ళి చేయాలని తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఆయితే మాణిక్యం ఇచ్చే షాక్ లతో రామలక్ష్మి, సీతాకాంత్ లు కంగుతింటున్నారు.
ఇక ఈ సీరియల్ మొదలైనప్పటి నుండి కథ ఆసక్తిగా సాగుతుంది. గతజన్మ బంధంగా, ఆ జన్మలో రామలక్ష్మిని కోల్పోయిన సీతాకాంత్.. ఈ జన్మలో పెళ్ళి చేసుకున్నాడు. అయితే వీరిద్దరి మధ్య ప్రేమ లేదు. మరి మాణిక్యం పెట్టిన షరతుని వీళ్ళిద్దరు కలిసి నెరవేరుస్తారా లేదా? ధన, సిరిల పెళ్ళి జరుగుతుందా లేదా అనేది ప్రేక్షకులకి ఓ ఇంటెన్స్ ని క్రియేట్ చేసింది. అయితే తాజాగా విడుదలైన ప్రోమోలో సీతాకాంత్ కాఫీ తీసుకొని వస్తాడు. అది చూసిన రామలక్ష్మి షాక్ అవుతుంది. నేను తెచ్చింది కాఫీనే ఏదో హత్యచేసినట్టు అంత షాక్ అవుతున్నావని సీతాకాంత్ అంటాడు. అది కాదు సర్.. నేను మీరు ఇద్దరం లేటుగానే పడుకున్నాం ఎలా మీరు ముందు లేచారని రామలక్ష్మి అడుగుతుంది. అదా.. సిరి కన్నీళ్ళు నన్ను పడుకోనివ్వలేదని, వారిద్దరి పెళ్లి చేయాలని, చేస్తానని సీతాకాంత్ అంటాడు. మరి ఇది నెరవేరుతుందా? సీతాకాంత్ ప్లాన్ ని మాణిక్యం పసిగట్టగలడా తెలియాలంటే ఈ స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే ఈ సీరియల్ ని మిస్ అవ్వకుండా చూసేయ్యండి.
![]() |
![]() |